Kontha sepu kanabadi song lyrics in telugu || good friday songs || కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే

 కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే 


కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే 

 ఆవిరివంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు

 మరణమైన జీవమైన నిన్ను విడువడు..


ఎదురౌతారెందరో నీ పయనంలో 

 నిలిచేది ఎందరు నీ అక్కరలో..

వచ్చేదెవరు నీతో మరణమువరకూ 

ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు 

 మరణమైన జీవమైన నిన్ను విడువడు..


చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి 

ఆస్తులు సంపాదించినా శాంతి వున్నదా...?!

ఈరాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే 

 సంపాదన ఎవరిదగును యోచించితివా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు 

 మరణమైన జీవమైన నిన్ను విడువడు..


నీ శాపం తాను మోసి పాపం తీసి 

 రక్షణభాగ్యం నీకై సిద్ధము చేసి..

విశ్రాంతినీయగా నిన్ను పిలువగా 

 నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు 

 మరణమైన జీవమైన నిన్ను విడువడు..

Kontha sepu kanabadi song lyrics in telugu || good friday songs || కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే Kontha sepu kanabadi song lyrics in telugu || good friday songs || కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే Reviewed by ALLINONE on February 15, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.