తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చెబాలునిగా - (2)
ఆకాశంలో దూతలు పాడే భూమి అంతా
సంబరమయే - (2)
సింహాసనమే వదిలాడయ్యా మానుషరూపము దాల్చి వచ్చాడయ్య
కోరి వచ్చెను కారణ జన్ముడే - (2) !!
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
(1) - నశించిపోవుట తనకు ఒప్పనోల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
రాజు మారెను దాసుని గాను చేసికొనెను రిక్తునిగాను - (2)
పశుల పాకలో పరుండినాడయ్యా నీ కోరకు నా కొరకు ఆ మెస్సయ్యా
కోరి వచ్చెను కారణ జన్ముడే - (2)!!
కాడి మోయను కాదిలెను కరుణాత్ముడే
(2) -తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
మనకై పుట్టెను ఇలాలో రేడు రక్షణ వచ్చెను
మన ఇంటికి నేడు - (2)
సంతోషమునే నింపాడయ్యా మన బ్రతుకులలో ఆ మెసయ్యా
కోరి వచ్చెను కారణ జన్ముడే - (2) !!
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567