అమూల్య రక్తం – ప్రశస్త రక్తం, amulya raktham prasatha raktham || telugu christian songs lyrics

 అమూల్య రక్తం – ప్రశస్త రక్తం

విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం, amulya raktham prasatha raktham || telugu christian songs lyrics  అమూల్య రక్తం – ప్రశస్త రక్తం, amulya raktham prasatha raktham || telugu christian songs lyrics Reviewed by ALLINONE on January 07, 2026 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.