దేశ భక్తుడు - ఉపమానం (Moral Story )


                        12 Heart-touching Quotes From Indian Army Will Surely Resonate ...
   దేశ  భక్తుడు                         





ఒక రాజు దగ్గర ఒక వంటవాడు ఉండేవాడు . రాజు బోజనం వండి పెడుతూ అందరి ప్రశంసలు పొందుతుండేవాడు . అతడు ఏ పదార్ధము వండినా ముందు రుచి చూచేవాడు . ఒక వంటవాడికి అంత ప్రాధాన్యము ఇవ్వడం నచ్చని మంత్రి - రాజు దగ్గరకు వెళ్ళి " రాజా సామ్రాజ్యానికి చక్రవర్తులైన , మీరు తినే భోజనాన్ని మీకన్నా ముందుగా రుచి చూచేవారికి ఎలాంటి శిక్ష విధిస్తారు " ? అని అడిగాడు .

 " సందేహమేముంది ? శిరచ్చేదమే " అన్నాడు రాజు కోపంగా , మంత్రి వెంటనే వంటవాడు జహ్వచాపల్యం గురించి చెప్పాడు . ఆ మర్నాడు రాజు అకస్మాత్తుగా పాకశాలను దర్శించాడు . ఆ సమయానికి వంటవాడు అప్పుడే వండిన రొయ్యల పులుసును ఒక చెంచాతో తీసుకొని రుచి చూస్తూ  కనిపించాడు . అది చూసిన రాజుకు కోపం ముంచుకు వచ్చింది . దర్బారుకు పిలిపించి " ఇలాంటి పనిచేస్తున్నందుకు నిన్నెందుకు ఉరితీయకూడదు " ? అని వంటవాణ్ని గద్దించాడు రాజు . 

                       Royyala pulusu - telugufoodrecipes.com

                              వంటవాడు ముందు భయపడినా తర్వాత ధైర్యము తెచ్చుకొని " ధర్మ ప్రభువులైన మీరు ఒక దేశ భక్తుడిని ఉరితీయాలనిపిస్తే అలాగే చేయండి " అన్నాడు నిబ్బరంగా , “ వండిన వంటను రాజుకన్నా ముందే తినేవాడు దేశభక్తుడెలా అవుతాడు " అన్నాడు రాజు మండి పడుతూ 

“ రాజా ! మీరు దేశానికే రక్షకుడు అటు వంటి మిమ్ముల్ని రక్షించుకోవడానికే ఈ పని చేస్తున్నాను " అన్నాడు . వంటవాడు “ వివరంగా చెప్పు " అన్నాడు రాజు . “ మీరు తినే వంటలో ఎవరైనా శత్రువులు విషం కలపవచ్చు . వండుతున్నప్పుడు కలిగే వేడికి ఏదైనా విషపు కీటకం పదార్ధంలో పడిపోయి ఉండవచ్చు . అలాంటి ఆహారాన్ని నేరుగా మీరు భుజిస్తే ఎంత ప్రమాదం ? భోజనం అందుకనే మీకన్నా ముందు నేను రుచి చూస్తాను . 


                                    Cartoon chef. Cartoon illustration of a chef tasting soup ...
ఒక వేళ ఆహారం విషపూరితమైతే నష్టం జరిగేది నాకే , అయినా మిమ్ముల్ని కాపాడుకోవాలనే నా తపన దేశభక్తికి నిదర్శనమే కదా ? అన్నాడు వినయముగా - ఆ జవాబుకు రాజు ముగ్ధుడయ్యాడు . ఆనాటి నుండి వంటవాడి జీతాన్ని రెట్టింపు చేశాడు . 



నీతి :

                                              నీతి వాక్యాలు - Neethi Vakyalu added a... - నీతి ...
                నమకమైన వారికి మెండుగా దీవేనులు వచ్చును 

Follow this Page To get More Stories and new Information

Your Nireekshan Signing out .... Bye....
                
                                                                                (:



దేశ భక్తుడు - ఉపమానం (Moral Story ) దేశ  భక్తుడు - ఉపమానం (Moral Story ) Reviewed by ALLINONE on June 18, 2020 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.