నక్షత్రం ఉదయించెను యాకోబులో , Nakshatram udayinchenu yakobulo lyrics in telugu , Joshuva Gariki New telugu Christmas Song Lyrics

 



నక్షత్రం ఉదయించెను యాకోబులో

రాజదండము లేచెను ఇశ్రాయేలులో..2..

స్వల్పమైన బేత్లేహేము ఎప్రాతా నుండి 

లోకాన్ని ఏలువాడు ఏతెంచేను..2..


1. మనుష్యుని పోలికగా జన్మించి 

దాసుని రూపం దాల్చుకున్నాడు 

తన్ను తానే రిక్తునిగా చేసుకొని 

కల్వరి సిలువలో మరణించాడు..2..

మృత్యుంజయుడై -  తిరిగి లేచాడు..2..

పరలోక రాజ్యానికి - దారి చూపాడు..2..


2. పాపం బాపెను శాపం బాపెను 

దుఃఖమంతా తొలగించెను 

శాంతి సమాధానం లోకానికి ఇచ్చెను

నీతి రాజ్యం స్థాపించెను..2..

కరుణించే యేసయ్య - జీవమిచ్చే యేసయ్య..2..

మనిషిగా జన్మించి - రక్షనిచ్చాడు..2..


3. పాపాలొప్పుకొని యేసుని నమ్మితే 

పరిశుద్దినిగా మార్చివేస్తాడు

నిత్య నరకాగ్ని నుండి తప్పించి 

నిత్య రాజ్యం  చేరుస్తాడు..2..

యేసయ్యే మార్గం - యేసయ్యే సత్యం..2..

యేసయ్యే జీవం - యేసయ్యే ద్వారం..2..


click here to watch song

నక్షత్రం ఉదయించెను యాకోబులో , Nakshatram udayinchenu yakobulo lyrics in telugu , Joshuva Gariki New telugu Christmas Song Lyrics  నక్షత్రం ఉదయించెను యాకోబులో , Nakshatram udayinchenu yakobulo lyrics in telugu , Joshuva Gariki New telugu Christmas Song Lyrics Reviewed by ALLINONE on November 14, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.