Tamalapaku Laddu Recipes : తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా ? తయారి ఇలా ........
తమలపాకు లడ్డూ తయారు చేసుకోండి ఇలా !
>తమలపాకులు - 20 ( శుబ్రంగా కడిగి , కాడలు తుంచి పెట్టుకోవాలి )
>శనగపిండి - 250 గ్రాములు
>బేకింగ్ సోడా - కొద్దిగా
>జీడిపప్పు, కిస్మిస్ -కొన్ని (నేతిలో వేయించుకోవాలి)
> పంచదార - 400 గ్రాములు
>నూనె -డీప్‌ఫైకి సరిపడా
>పుడ్ కలర్ - కొద్దిగా (గ్రీన్)
తయారీ:
>ముందుగా తమలపాకుల్లో నీళ్లు పోసుకుని... మిక్సీ పట్టుకుని... పలుచటి క్లాత్‌లో వేసుకుని... రసం మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి.
>అనంతరం శనగపిండిలో బేకింగ్ సోడా, తమలపాకుల రసం వేసుకుని... హ్యాండ్ బ్లండర్‌తో బాగా కలుపుకోవాలి.
> కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని... మరికాస్త నీళ్లు పోసుకుని... పలుచగా చేసుకోవాలి.
>తర్వాత కళాయిలో నూనె వేడి చేసుకుని... అందులో జల్లెడ సాయంతో తమలపాకు మిశమాన్ని
వేసుకుంటూ... చిన్న బూందీలా వేయించుకోవాలి.
>ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకుని... అందులో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకుని... తీగపాకం మొదలయ్యే సమయంలో తమలపాకు బూందీని వేసుకుంటూ బాగా కలపాలి.
>జీడిపప్పు, కిస్మిసలను అందులో వేసుకుని దగ్గర పడేదాకా చిన్న మంట మీద ఉదకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక లడ్డూల్లా చేసుకోవాలి.
Tamalapaku Laddu Recipes : తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా ? తయారి ఇలా ........
Reviewed by ALLINONE
on
January 19, 2023
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567