Capsicum Bajji Recipe : రుచికరమైన క్యాప్సికం బజ్జి తయారి ఇలా ......

 Capsicum Bajji Recipe : రుచికరమైన క్యాప్సికం బజ్జి తయారి ఇలా ......

రుచికరమైన క్యాప్సికమ్‌ బజ్జీ తయారు చేసుకోండిలా...



కావలసినవి:

➤ క్యాప్సికమ్‌ - 6 లేదా 8 (శుభ్రంగా కడిగిపెట్టుకుని.. నాలుగు వైపులా చాకుతో గాటు పెట్టుకోవాలి),

➤ శనగపిండి - 1 కప్పు

➤ ఉప్పు - తగినంత

➤  కారం -1టీ స్పూన్‌

➤ పసుపు - చిటికెడు

➤ ధనియాల పొడి -అర టీ స్పూన్‌

➤ వంట సోదా -కొద్దిగా

➤ క్యారెట్‌ ముక్కలు, బీట్‌ రూట్‌ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు - రుచికి అదనంగా (అన్నీ ఒక బౌల్లో వేసుకుని... నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి)

➤నూనె -డీప్‌ ఫైకి సరిపడా


తయారీ:

➤ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోదా, ఉప్పు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి

➤ ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ... బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

➤ అనంతరం ఒక్కో క్యాప్సికమ్‌ తీసుకుని... శనగపిండి మిశ్రమంలో ముంచి... నూనెలో డీప్‌ ఫై చేసుకోవాలి.

➤ చల్లారాక చాకుతో ఒక వైపు కట్‌ చేసుకుని... అందులో క్యారెట్‌ ముక్కల మిశ్రమాన్ని నింపుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు.



Capsicum Bajji Recipe : రుచికరమైన క్యాప్సికం బజ్జి తయారి ఇలా ...... Capsicum Bajji Recipe : రుచికరమైన క్యాప్సికం బజ్జి తయారి ఇలా ...... Reviewed by ALLINONE on January 19, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.