అద్వితీయుడా
పల్లవి:
మదిలోన నీరూపం- నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా
1. ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్ఫూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే ఊహించని ఉప్పెనలై జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా
ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా
మదిలో
2. నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిశగా నడిపెనే నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా
|| మదిలోన ॥
3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా ! యేసయ్యా
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే
మదిలో
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567