Daiva Pranalika Song Lyrics in telugu || దైవ ప్రణాళిక || Hosanna New Songs 2023 || నా కోరిక నీ ప్రణాళిక

 



నా కోరిక నీ ప్రణాళిక 

పరిమలించాలని 

నా ప్రార్ధన విజ్ఞాపన 

నిత్య మహిమలో నిలవాలని   ( 2 )


అక్షయుడా నీ కల్వరి త్యాగం 

అంకితభావం కలుగజేసెను 

ఆశలవాకిలి తెరచినావు 

అనురాగ వర్షం కురిపించినావు  (2 )


నా హృదయములో ఉప్పెంగేనే 

కృతజ్ఞత సంద్రమే 

నీ సన్నిధిలో స్తుతి పాడనా 

నా హృదయ విద్వంసుడా     ||  నా కోరిక నీ ప్రణాళిక  ||


చరణం 1 :

యధార్ధవంతుల యెడల 

నీవు యడబాయక కృప చూపి 

గాడంధకారము కమ్ముకొనగా 

వెలుగు రేఖవై ఉధయించినావు    (2 )


నన్ను నీవు విడిపించినావు 

ఇస్టుడునై నే నడచి నందున 

దీర్గాయువుతో త్రుప్తిపరచిన 

సజీవుడవు నీవేనయ్యా    ||  నా హృదయములో ఉప్పెంగేనే  ||


చరణం 2 : 


నాలో ఉన్నదీ విశ్వాస వరము 

తోడై ఉన్నదీ వగ్ధనభలము 

దైర్యపరచి నడుపుచున్నది 

విజయశిఖరపు దిశగా  (2 )


అర్ప జాలని నీ ప్రేమతో 

ఆత్మ దీపము వెలిగించినావు 

దీన మనస్సు వినయభావము 

నాకు నేర్పిన సాత్వికుడ    ||  నా హృదయములో ఉప్పెంగేనే  ||


చరణం 3 : 


స్వచ్చమైన నీ వాక్యం 

వన్నె తరగని నీ ఉపదేశం 

మహిమ కలిగిన సంఘముగా  నను 

నిలుపునే నీ ఎదుట   ( 2 )


సిగ్గుపరచదు నన్నేనడు

నీలో నాకున్న నిరీక్షణ 

వేచియున్నాను నీ కోసమే 

సిద్ధపరచుము సంపూర్ణుడ    ||  నా హృదయములో ఉప్పెంగేనే  ||










Daiva Pranalika Song Lyrics in telugu || దైవ ప్రణాళిక || Hosanna New Songs 2023 || నా కోరిక నీ ప్రణాళిక Daiva Pranalika Song Lyrics in telugu  ||  దైవ ప్రణాళిక || Hosanna New Songs 2023 || నా కోరిక నీ ప్రణాళిక Reviewed by ALLINONE on March 02, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.