తాలిమే చూపినావు
పల్లవి :
తాలిమే చూపినావు - త్రోవతప్పిన నాపై
త్యాగమే చేసినావు - యేసయ్య కొరకై "2"
అనుపల్లవి :
నేనంటే నీకు ఎందుకింత ప్రేమయ్యా
నాపైన నీకు ఇంత జాలి ఎందుకయ్యా '2"
చరణం :1
నీ శిలువ త్యాగమే యేసయ్య నిను చేరుటకు - నా జీవితానికి వారధి ఆయెను
నీ తనువుచీల్చబడెను పాపపుతెర తొలగిపోయేను - నీతో స్నేహమే నాకు దొరికేను "2"
నీతిమంతునిగా నను తీర్చుటకు - నా దుర్నీతినే నీవు ధరియించితివి
నీదు పరిశుద్ధతను నాక్కిచ్చుటకు - నా పాపమే భరియించితివి
" నేనంటే నీకు "
చరణం :2
నిర్థోషమైన నీ రక్తము నాకొరకు చిందిం పబడెను ఆ కల్వరిలో
నిర్జీవమైన నా క్రియలను విడచుటకు - నీ రక్త ధారలే నాకు మార్గములాయెను "2"l
జీవముగల నిన్ను సేవించుటకు - మనస్సాక్షినే శుద్ధిచేసితివి.
నీ నిత్య స్వాస్థ్యమును నాకిచ్చుటకు - నీ నిబంధనను స్థిరపరచితివి.
" నేనంటే నీకు"
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567