ఎడబాయని నీ కృప || Edabayani nee Krupa Lyrics in Telugu || Telugu Lyrics

                                       TELUGU CHRISTIAN SONGS LYRICS





      ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
           యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||

చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో 
               కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో   ||2||
              అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
              కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి  ||2||  ||ఎడ||


చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు 
              లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
              దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా  ||2||
              దీర్ఘ శాంతము గలదేవా 
               నా చేయి విడువక నడిపించితివి  ||2||  ||ఎడ||

చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో 
               నా బలమును చుసుకొని నిరాశ చెందితిని  ||2||
               భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా  ||2||
               ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||
ఎడబాయని నీ కృప || Edabayani nee Krupa Lyrics in Telugu || Telugu Lyrics ఎడబాయని నీ కృప || Edabayani nee Krupa Lyrics in Telugu || Telugu Lyrics Reviewed by ALLINONE on January 27, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.