Arthur Stance Testimony In Telugu || ఆర్థర్ స్టేస్

 


ఆర్థర్ స్టేస్ ( Arthur Stance )

జననం 09-02-1885  

 మహిమ ప్రవేశం : 30-07-1967  

స్వస్థలం : రెడ్ఫే ర్న్ 

దేశం - ఆస్ట్రేలియా 

 దర్శన స్థలము : ఆస్ట్రేలియా 


మిస్టర్ ఇటర్నిటీ అని కూడా పిలువబడే ఆర్డర్ మాల్కమ్ స్టేస్  ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో ఒక మురికివాడలో జన్మించారు . అతను మద్యపానాసక్తులైన తన తల్లిదండ్రుల నుండి సరియైన ప్రేమా శ్రద్దలను పొందకపోవడమే కాక , వారి చేతులలో ఎంతో బాధను అనుభవించారు . కాగా అతను తన చిన్న వయస్సు నుండే అల్లర దొంగతనాలు చేసే ఒక దొంగ అయ్యారు . కేవలం బ్రతకడం కోసం అతను పాలు , రొట్టెలు లేదా మరేదైనా దొరికిన దానిని దొంగిలించేవారు . అతనికి చదువు లేదు . తన పేరును కూడా సరిగా వ్రాయలేరు . 20 ఏళ్ళ వయస్సు వచ్చేటప్పటికి మద్యపానానికి బానిసగా మారారు . ఎంత ప్రయత్నించినా మద్యపానమును మాత్రం అతను వదులుకోలేకపోయారు . మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సైన్యంలో అతను చేరినప్పటికీ , దాదాపు మూడు సంవత్సరముల తరువాత వైద్యపరమైన కారణముల దృష్ట్యా అనర్హులుగా ఎంచబడి సైన్యములో నుండి పంపివేయబడ్డారు . కాగా ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన అతను తన పాత త్రాగుడు అలవాటును తిరిగి కొనసాగించారు . 

అటువంటి సమయములో 1930 వ సం || లో , ప్రసంగాన్ని విన్నవారికి ఉచిత భోజనం అని ఒక ఇవాంజెలికల్ ఆంగ్లికన్ సంఘం ప్రకటించింది . ఆకలితో అలమటిస్తూ నిరాశానిస్పృహలతో నిస్సహాయమైన స్థితిలో ఉన్న స్టేస్ ఆ కూడికలలో ఒకదానికి హాజరయ్యారు . అక్కడ అతను విన్న రక్షణ సందేశం అతని హృదయమును మార్చివేసింది . అతను వెంటనే బయటకు వెళ్ళి , " ప్రభువా . పాపినైన నా పట్ల దయ చూపుము " అని ఎలుగెత్తి మొర్రపెట్టారు  . ఈ రోజు మొదలుకొని ఈ భూమిపైన అతని ఆఖరి రోజు వరకు కూడా ఎటువంటి పాపినైనా రక్షించగల సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమకు అతను ఒక సజీవ సాక్షిగా జీవించారు . 

రెండు సంవత్సరాల తరువాత అతను ఒక కూడికకు హాజరైనప్పుడు అక్కడ ఒక సువార్తికుడు " నీవు నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతున్నావు ? " అని ప్రసంగిస్తున్నారు . వెంటనే ' నిత్యత్వం ' ( ' ఇటర్నిటి  ) అనే పదం స్టేస్ యొక్క దృష్టిని ఆకర్షించింది . తన స్వంత పేరును వ్రాయుటకే కష్టపడే అతను , పాదచారులు నడిచే ఫుట్ పాత్ ల  పైన . ఇంటి గుమ్మముల పైన , రైల్వే స్టేషన్ యొక్క ప్రవేశ ద్వారాల పైన , ఆ విధంగా తనకు తోచిన చోటల్లా ఇటర్నిటీ ' అని వ్రాయడం ప్రారంభించారు . ఒకే ఒక్క పదం ద్వారా అతను ఇస్తున్న సందేశం మరణానంతరం తాము చేరుకొనబోవుతున్న శాశ్వత గమ్యం ఎమైయున్నదని అది చదివినవారిని ఆలోచింపజేసింది . తరువాతి 35 సంవత్సరాలు అతను పెందలకడనే నిద్రలేచి ' ఇటర్నిటి  ' అనే పదమును వివిధ ప్రదేశాలలో రోజుకు కనీసం 50 సార్లు వ్రాశారు .

 స్టేస్ యొక్క వైవిధ్యమైన రీతిలో బహిరంగముగా బోధించే పద్ధతి దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించింది . బహిరంగ ప్రదేశాలలో ఆ విధంగా రాస్తున్నందుకు కొన్నిసార్లు అతను అరెస్టు చేయబడ్డారు కూడా , అయినప్పటికీ , అతను తన ప్రయత్నాల నుండి విరమించుకోలేదు . అతను వీధుల కూడళ్ళలో ప్రజలను సమకూర్చి దేవుని వాక్యము గురించి తనకున్న కొద్దిపాటి జ్ఞానముతోనే తనకు తెలిసినదానిని వారికి బోధించేవారు . సిడ్నీలో నేటికీ కొన్ని చోట్ల మిగిలి ఉన్న స్టేస్ వ్రాసిన ' ఇటర్నిటీ ' అనే పదం , వారు తప్పించుకోలేని నిత్యత్వం గురించి ప్రజలకు గుర్తుచేసేదిగా ఉంది . ప్రియమైనవారలారా , మీరు నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతున్నారు ?


తెలుగు లో అనువదించిన వారు ఆర్ . ప్రియాంక 

Arthur Stance Testimony In Telugu || ఆర్థర్ స్టేస్ Arthur Stance Testimony In Telugu || ఆర్థర్ స్టేస్ Reviewed by ALLINONE on May 20, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.