Constantine Joseph Beschi Testimony In Telugu || కాన్స్టాంటైన్ జోసఫ్ బెస్చి

 మిషనరీ జీవిత చరిత్ర 


కాన్స్టాంటైన్ జోసఫ్ బెస్చి   ( Constantine Joseph Beschi )

జననం : 18-11-1000 

మహిమ ప్రవేశం : 04-02-1747 

స్వస్థలం : మంతుదా 

దేశం : ఇటలీకి 

దర్శన స్థలము : భారతదేశం 

ఇటలీకి చెందిన కాన్స్టాంటైన్ జోసఫ్ బెస్సి ( లేదా కోస్టాన్  గియుసేప్ బెస్సి ) దక్షిణ భారతదేశంలో సేవచేసిన ఒక మిషనరీ మరియు ప్రఖ్యాత తమిళ కవి , ఉన్నత విద్యావంతులైన అతను , లాటిన్ , గ్రీకు , హెబ్రీ మరియు పోర్చుగీసుల వంటి పలు భాషలలో మంచి పట్టు ఉన్నవారు . అతను రావెన్నా మరియు బోలోగ్నాలలో బైబిలు వేదాంతశాస్త్రములో శిక్షణ పొందారు . తరువాత దక్షిణ భారతదేశంలోని మదురైలో మిషనరీ సేవ చేయుటకు అతను నియమించబడగా , 1710 వ సం || లో మొదట గోవాకు వచ్చి , 1711 వ సం || లో మదురైకి వెళ్ళారు .


 18 వ శతాబ్ద ప్రారంభ సంవత్సరాలలో రాజకీయపరముగా దక్షిణ భారతదేశంలో తీవ్ర అశాంతి నెలకొంది . తంజావూరు మరియు మదురై పాలకులు క్రైస్తవులకు వ్యతిరేకులుగా ఉండి మిషనరీలను హింసించారు . అటువంటి సమయంలోనే బెస్చి తమిళుల మధ్య పరిచర్య చేసి వారిని క్రీస్తు యొద్దకు నడిపించుటకు తనను సమర్పించుకున్నారు . కాగా తంజావూరు సమీపంలోని ఎలకురిచి అనే ఒక చిన్న పట్టణములో అతను తన మిషనరీ పనిని ప్రారంభించారు . త్వరలోనే అతను తమిళం , సంస్కృతం , తెలుగు మరియు ఉర్దూ భాషలలో పట్టు సాధించి , ఆ భాషలలో మతపరమైన రచనలను వ్రాయడం ప్రారంభించారు . పాశ్చాత్య క్రైస్తవ సంఘ సంస్కృతినే ఇక్కడ కూడా అన్వయింపజేయుట సరియైనది కాదని తలంచిన బెస్సి , స్థానిక సంస్కృతికి అనుగుణంగా స్వదేశీ సంఘములను స్థాపించారు . అతని మిషనరీ పరిచర్యలో 12,000 మందికి పైగా బాప్తిస్మం తీసుకున్నట్లు చెప్పబడుతుంది .


 అతను ప్రధానంగా మిషనరీ పని చేసినప్పటికీ , తన సాహిత్య రచనలకు , ముఖ్యంగా తమిళంలో చేసిన రచనలకు పేరుగాంచారు . స్థానిక ప్రజలకు వారి స్వంత భాషలోనే బోధించాలనే అతని వాంఛ అతను ఒక తమిళ పండితునిగా మరియు కవిగా మారుటకు కారణమయ్యింది . అతను ప్రచురించిన తమిళ సాహిత్య వ్యాకరణ పుస్తకములు మరియు నిఘంటువులు మిషనరీ సేవ కొరకు తమను సిద్ధపరచుకొనుటలో తరువాత వచ్చిన మిషనరీలకు ఎంతో ఉపకరించాయి . అన్ని వర్గాల ప్రజలు , క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు కూడా అతని పుస్తకములను ఇష్టముగా చదివెడివారు .

 అందువలన అతనిని తరచుగా తమిళ గద్య పితామహుడు ' అని పేర్కొంటారు . శ్రమలు కలిగిన సమయంలో బెస్పి ఎంతో స్థిరముగా నిలబడ్డారు . అతనికి కలిగిన బెదిరింపులు మరియు అతనిపై జరిగిన హత్యాప్రయత్నాల వలన దేవుని కొరకు మరింత ఉత్సాహముతో పనిచేయుటకు అతను ప్రోత్సాహమొందారే గానీ కృంగిపోలేదు . 1738 వ సం || వరకు తంజావూరు ప్రాంతంలో సేవ చేసిన కాన్‌స్టాంటైన్ బెస్సి , తదుపరి కోరమాండల్ తీర ప్రాంతములో సేవను కొనసాగింది . అక్కడే తన తుది శ్వాసను విడిచారు . 

ప్రియమైన వారలారా , మీరు మీ తలాంతులను దేవుని సంఘమును కట్టుటకు ఉపయోగించుచున్నారా ? 

Constantine Joseph Beschi Testimony In Telugu || కాన్స్టాంటైన్ జోసఫ్ బెస్చి Constantine Joseph Beschi Testimony In Telugu || కాన్స్టాంటైన్ జోసఫ్ బెస్చి Reviewed by ALLINONE on May 20, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.