రాబర్ట్ ముర్రే మచెయిన్
జననం : : 21-06-1813
మహిమ ప్రవేశం : 05-03-1843
స్వస్థలం : ఈడెన్బర్గ్
దేశం : స్కాట్లాండు
దర్శన స్థలము : యునైటెడ్ కింగ్డమ్
స్కాట్లాండుకు చెందిన ఒక సంపన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించారు రాబర్ట్ ముర్రే మచెయిన్ , అతను ప్రారంభములో తన యవ్వన జీవితమును లోకానుసారముగా పాపముతో నిడుకొనియున్నదిగా జీవించుచుండగా , అతని అన్నయ్య యొక్క అకాల మరణం జీవితముపై అతను కలిగియున్న దృక్పథమును మార్చివేసింది . అటువంటి సమయంలోనే అతను డేవిడ్ డిక్సన్ వ్రాసిన ' సమ్ ఆఫ్ సేవింగ్ నాలెడ్జ్ ' ( రక్షించు జ్ఞానము యొక్క సమకూర్పు ) అను పుస్తకమును చదవడం జరిగింది . తద్వారా క్రీస్తుతో ఒక నూతన అనుబంధములోనికి అతను నడిపించబడ్డారు . యేసు క్రీస్తు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అతను , ఈడెన్బర్గ్ డివినిటీ హాల్ లో థామస్ చామర్స్ ఆధ్వర్యంలో తన దైవిక శాస్త్ర అభ్యాసమును ప్రారంభించారు . తదుపరి 1836 వ సం || లో డుండిలోని సెయింట్ పీటర్స్ సంఘమునకు పాదిరిగా నియమితులయ్యారు రాబర్ట్ ,
డుండిలో ఉన్నప్పుడు నగరంలో ప్రబలంగా ఉన్న అన్యజనుల ఆచారములను మరియు విగ్రహారాధనను చూసి రాబర్ట్ ఎంతో వేదన చెందారు . నశించిపోవుచున్న ఆత్మలను రక్షించుటకు అతను వారికి బోధించుటలోను మరియు ప్రార్థనలోను ఎంతగానో పోరాడారు . అతను శ్రోతలను మెప్పించులాగున కాదు గానీ , వారు వారి పాపములను గురించి ఒప్పింపబడులాగున ప్రసంగించేవారు . “ శరీర సంబంధులుగా ఉన్న మనుష్యులను గనుక సువార్త మెప్పించినట్లయితే , అది సువార్తె కాదు .... విరిగి నలిగిన హృదయం మాత్రమే సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించగలదు . " అని రాబర్ట్ అభిప్రాయం . “ మరికొన్ని ఆత్మలను క్రీస్తు నొద్దకు ఎలా తీసుకురాగలనని ఆలోచించకుండా నేను నిద్ర లేచిన ఉదయం లేదు అని నేను చెప్పగలను " అను అతని మాటలలో నశించుచున్న వారిని రక్షించుటకు ఎంతటి లోతైన వాంఛను అతను కలిగియున్నారో స్పష్టపరచబడుతుంది . అతను ప్రసంగిచేటప్పుడు , వింటున్నవారు నరకపుటంచులలో వ్రేలాడుతున్నారేమో అన్నంతగా వారిని బ్రతిమిలాడుతున్నట్లు కన్నీళ్ళతో ప్రసంగించే దృశ్యాలు తరచుగా కనిపిస్తాయి . అంతేకాకుండా క్రైస్తవ సంఘముల యొక్క ఆత్మీయముగా మృతమైన స్థితిని గురించి కూడా ఎంతో భారము కలిగియున్న అతను , విశ్వాసులను ఉజ్జీవింపజేయుటకు శ్రమించారు .
యూదులలో పరిచర్య చేసే అవకాశాలు ఏవిధముగా ఉన్నాయని పరిశీలించుటకుగాను 1838 వ సం || లో అతను ఇశ్రాయేలు దేశమును సందర్శించారు . దాని ఫలితముగా ' చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ ' సంఘముచే యూదులలో అనేక మిషనరీ సేవలు ప్రారంభించబడ్డాయి . అంతేకాకుండా , ఇంగ్లాండు ఉత్తర భాగంలోను , లండన్ మరియు బెర్పేర్ ప్రాంతములలోను సువార్త సేవ చేయుటకు అతను పర్యటించారు . తరచుగా అనారోగ్యం అతనిని పట్టి ఉంచినప్పటికీ , ఆత్మీయ పరుగులో అతను తన తోటివారికంటే ముందున్నారు . అత్యాసక్తిగల ప్రార్ధనాయోధుడు , ప్రసిద్ధ కీర్తనకారుడు మరియు శక్తివంతమైన బోధకుడు అయిన రాబర్ట్ ముర్రే , తన పరలోకపు యజమానుని సేవించుటకై తనకున్న సమస్తమును సమర్పించి , 30 సం || ల లేతప్రాయములోనే తన పరలోకపు వాస స్థలమును చేరుకున్నారు .
ప్రియమైన వారలారా , నశించుచున్న ఆత్మలను గురించిన భారమును మీరు కలిగియున్నారా ?
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567