సొలొమోన్ దొరైస్వామి
జననం : 17-06-1217
మహిమ ప్రవేశం : 2-05-1982
స్వస్థలం : అరకోణం
దేశం : భారతదేశం
దర్శన స్థలము - తమిళనాడు , భారతదేశం
బిషప్పైన ఎడ్గార్ బెంట్లే థోర్ప్ భారతదేశాన్ని విడిచి వెళ్ళినప్పుడు , తిరుచిరాపల్లి - తంజాపూర్ డైయోసెస్లో ( సంఘ పరిథి ప్రాంతం ) గందరగోళ పరిస్థితి ఏర్పడింది . ఒకవైపు పదవి కొరకు పోటీలు , మరొకవైపు అంతర్గత పోరాటాలు , గొడవలు . వాటన్నింటి మధ్య ' దక్షిణ ఇండియా సంఘము ' ( ' చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ' - సి.ఎస్.ఐ. ) యొక్క కార్యవర్గ మండలి ఆ డైయోసెను నాయకత్వం వహించుటకు తగిన వ్యక్తిగా డా || సొలొమోన్ దొరైసామిని గుర్తించింది . కాగా 1964 వ సం || ఫిబ్రవరి 8 వ తారీఖున తంజావూరులోని సెయింట్ పీటర్స్ చర్చిలో దొరైసామి బిషప్పుగా నియామక అభిషేకమును పొందారు . కార్యవర్గ మండలి విశ్వసించినదానికి తగినట్లే ఆత్మీయ మరియు భౌతిక విషయాలలో డైయోసెన్ను సమర్ధవంతంగా నడిపించారు సాలొమోన్ దొరైస్వామి .
ముఖ్యముగా సామజిక సంఘ అభివృద్ధి కొరకు ప్రజలకు తోడ్పడేవిగా ఉండే పలు సేవాకార్యక్రమాలను ప్రారంభించినవారిగా దొరైసౌమి పేరుగాంచారు . ఒక విద్యావంతుడైన క్రైస్తవుడు సమాజానికి అందించగలిగినది . కేవలం మతవిశ్వాసము మాత్రమే కాదని అతను దృఢముగా విశ్వసించేవారు . తిరుచిరాపల్లిలోని బిషప్ హెబెర్ కళాశాలను పునరుద్ధరించడం అతను సాధించిన కార్యములలో ఒకటి . భారతదేశంలో క్రైస్తవ ఉన్నత విద్య ను గురించి లిండ్సే కమిషన్ చేసిన సిఫారసు మేరకు 1946 వ సం || లో బిషప్ హెబెర్ కళాశాల మూసివేయబడింది . అయితే , ఆ కళాశాల కేవలం విద్యాకేంద్రముగా మాత్రమే కాక ఆ ప్రాంతములో సామాజిక మార్పుకు కేంద్ర బిందువుగా ఉండుటచే తిరుచిరాపల్లి ప్రజలు కళాశాల మూసివేత పట్ల అసంతృప్తి కలిగియున్నారు . కాగా దొరైసామి బిషప్పుగా బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆ కళాశాలను పునఃప్రారంభించుటకు పూర్ణ హృదయముతో ప్రయత్నాలను చేపట్టారు . ఎట్టకేలకు 1966 వ సం || జూన్ మాసం 24 వ తారీఖున కళాశాల తిరిగి పనిచేయడం ప్రారంభించింది . అంతేకాక , జర్మనీ దేశమునకు చెందిన సంస్థలతో చేతులు కలిపిన అతను , పాఠశాలలు , గృహాలు మరియు పేద పిల్లల కొరకు వసతిగృహాలను నిర్మించారు . అతను చేపట్టిన పలు కార్యములు అతని పరిథి ప్రాంతములోని క్రైస్తవ సంఘములు పరులపై ఆధారపడక స్వతహాగా నిలబడుటకు సహాయపడ్డాయి .
దొరైసాయి తమిళ సాహిత్యంపై కూడా అత్యాసక్తిని మరియు అభిరుచిని కలిగియున్నారు . ఆత్మీయ జ్ఞానముతో నిండియున్న అతని పుస్తకములు ప్రజలు నిజమైన క్రైస్తవ విలువలతో కూడిన క్రైస్తవ జీవితమును జీవించుటకు తోడ్పడ్డాయి . ' వరల్డ్ తమిళ్ క్రిస్టియన్ ఫోరం ' ను ప్రపంచ తమిళ క్రైస్తవ పీరము ) కూడా స్థాపించిన అతను . దానిని విజయవంతముగా నడిపించుటలో కూడా ఉత్తీర్ణులయ్యారు . 1882 వ సం || లో తన పదవి నుండి విరమణ పొందిన సొలొమోన్ దొరైసాము , మరణము వరకు కూడా దేవునికి నమ్మకమైన సేవకునిగా జీవించారు .
ప్రియమైనవారలారా , ఒక క్రైస్తవునిగా మీ సమాజానికి మీరు ఏమి అందిస్తున్నారు ?
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567